రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఫిర్యాదు చేసిన 60 రోజులలో గా రోడ్ల మరమ్మత్తులను పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని రోడ్లను పూర్తి చేయాలన్నారు. వచ్చే జూన్, జూలై నాటికి నిర్దేశించిన రోడ్లు, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిలను పూర్తి చేయాలని తెలిపారు. రోడ్లని బాగు చేసి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ వెబ్సైట్లలో నమోదు చేయాలని ఆదేశించారు.
రోడ్డు వేశాక కనీసం ఏడేళ్ల పాటు పాడవకుండా చూసుకోవాలని ఉద్దేశం చేశారు. రోడ్లు కుంగిపోయే ప్రదేశాలను గుర్తించి, అలాంటి చోట్ల ఎఫ్డిఆర్ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే రోడ్డు నిర్మాణంపై దృష్టి పెట్టాలని తెలిపారు సీఎం జగన్.