ఆ జంతువులను ముట్టుకున్నా ఏమి కాదట..ఎందుకంటే?

-

ప్రస్తుత రోజుల్లో అన్నీ 3డి మాయం అయ్యింది..జనాల కళ్ళను మోసం చేస్తున్నా జిమ్మిక్కులను చేస్తున్నారు. అలా ఓ జూ పుట్టుకొచ్చింది.. ఆ జూ లో అన్నీ జంతువులు ఉంటాయి. కానీ, వాటిని ముట్టుకోవచ్చు.కానీ, ఏ ఒక్క జంతువు కూడా మిమ్మల్ని ఏంచేయదు. అదే విశాఖపట్నం ఇంజనీరింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్‌ జంతువుల ఎగ్జిబిషన్‌. విశాఖ వాసులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. విశాఖపట్నం మద్దెల పాలెంలో ఓ కృత్రిమ అడవిని సృష్టించారు.

అందులో దాదాపు 30కి పైగా జంతువులను ప్రదర్శిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ చిన్నారులను ఎంతగానో అలరిస్తుంది. ప్రమాదకరమైన పెద్ద పులిలు నుంచి రాక్షస బల్లులు వరకు రకరకాల క్రూర మృగాలను అతి దగ్గరగా చూసేందుకు ఏర్పాటు చేశారు. సరికొత్త జర్మనీ టెక్నాలజీతో ఈ రోబోటిక్ జంతు ప్రదర్శన ఏర్పాటు చేశారు.ఇందులో ఎక్కువగా పిల్లలకు భయాన్ని కలిగించే జంతువులు కూడా ఉంటాయి.. వాటిని అతి దగ్గరగా చూడటం పై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లోని జంతువులు అరుస్తాయి. శ్వాస తీసుకుంటాయి. కళ్లు మూస్తూ, తెరుస్తూ ఉంటాయి.. దీంతో పిల్లలు చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఈ రోబోటిక్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా థ్రిల్లింగ్‌గా ఉందని.ఇంత దగ్గరగా నిజంగా ఆ జంతువులను చూస్తున్న ఫీలింగ్‌ వస్తుందంటున్నారు.పరీక్షలతో టెన్షన్ పడిన విద్యార్థులకు ఈ రోబోటిక్ జంతు ప్రదర్శన కాస్త ఉపశమనం కలిగిస్తోంది. వేసవి ఎండలతో అలసిపోయిన నగరవాసులకు కూడా ఇది మంచి టైం పాస్‌ అని అంటున్నారు. మరో రెండు నెలల పాటు ఈ ఎగ్జిబిషన్‌ ను ఉంచనున్నారు. విశాఖ దగ్గరిలొ ఉంటే మీరు కూడా వెళ్ళి చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news