ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేయగానే ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. అసలు మండలి రద్దు నిర్ణయమే ఒక సంచలనం అనుకుంటే ఆ తర్వాత మంత్రులు రాజీనామా చేస్తారనే వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి. ఇక అప్పటి నుంచి మంత్రులు కొందరు రాజీనామా చేస్తారని, వాళ్ళ మీద జగన్ ఒత్తిడి ఎక్కువగా ఉందని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలు వచ్చాయి.
శాసనమండలి రద్దు తీర్మానం కేంద్రం చెంతకు చేరిన సందర్భంలో కేబినెట్ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తారని చెప్పారు. అయితే ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేయడం అనేది దాదాపుగా ఖాయమని అంటున్నారు. మండలి రద్దు అనేది ఇప్పట్లో జరిగే అవకాశాలు కనపడటం లేదు. కేంద్రం బిల్లుల షెడ్యూల్ లో కూడా దాన్ని పెట్టలేదు.
అయితే బిల్లు కేంద్రానికి మాత్రం వెళ్ళింది. వైసీపీకి చెందిన ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలపై అక్కడి నుంచే చర్చలు జరిగాయి. ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వానికి షాక్ తగలడం ఖాయమని అంటున్నారు. అందుకే ఇప్పుడు జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు.
రద్దుకి సిద్దమైనప్పుడు వాళ్ళు ఇద్దరూ ఎందుకు అనే ప్రశ్న వినపడుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేస్తే ఒక మంత్రి పదవి రోజాకు దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మార్కెటింగ్ శాఖను రోజాకు ఇవ్వాలని భావిస్తున్నారట. త్వరలోనే ఆమెకు ఉన్న ఏపీఐఐసీ పదవి తప్పించి దానిని మోపిదేవికి ఇవ్వాలని భావిస్తున్నారట జగన్. త్వరలోనే ఇది జరుగుతుందని అంటున్నారు.