కరోనా వైరస్ విష‌యంలో చంద్ర‌బాబును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి..

-

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ఈ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే చైనా దీనిపై పోరాటం చేస్తున్నది. వ్యాక్సిన్ ను కనుగొనడానికి అనేక శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు వ్యాక్సిన్ ను కనుగొనలేకపోయారు. అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఆ ప్రయత్నంలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఓవైపు చైనా సహా ప్రపంచదేశాలను ప్రాణాంతక కరోనా వైరస్ పీడిస్తున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రం సంధించారు.

కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో…. తుపానులను నియంత్రించగల అతీంద్రయ శక్తులున్న చంద్రబాబునాయుడి వైపు ప్రపంచమంతా చూస్తోందని ట్వీట్ చేశారు. కరోనా వైరస్ బారినుంచి కాపాడేందుకు ఆయన ఏదో ఒకటి చేయకపోతే ఈ భూమ్మీద మనుషులెవరూ మిగలరని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా అందరూ ఆందోళన చెందుతున్నారని సెటైర్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news