బడ్జెట్ ప్రవేశపెట్టడంలో రోషయ్యదే రికార్డ్…

-

సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోషయ్య మరణించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంలో తీవ్ర దు:ఖాన్ని మిగిల్చింది. రాజకీయంగా అజాత శత్రువుగా పేరున్న రోషయ్య నేడు మరణించారు. ఆయన హఠాత్మరంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ శూన్యతను మిగిల్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో.. రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత సీఎంగా తన మార్కును చాటుకున్నారు.

ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశ పెట్టడంలో దేశంలోనే రికార్డ్ ఆయనదే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు 15వ సీఎంగా రోషయ్య పనిచేశారు. సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. వరసగా 7 సార్లు, మొత్తంగా 16 సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డ్ స్రుష్టించారు. దేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర మంత్రిగా రికార్డ్ ఆయన పేరున ఉంది. రోషయ్య తొలిసారి మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో ఆర్ అండ్ బీ, రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2011-16 మధ్య తమిళనాడు, కర్ణాటక గవర్నర్ గా సేవలు అందించించారు రోషయ్య.

Read more RELATED
Recommended to you

Latest news