రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ RRR టీం కు అభినందనలు తెలిపారు.
ఇక రీసెంట్ గా జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్ లో అవుట్ స్టాండిగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘RRR’ అవార్డుని దక్కించుకుంది. ఇదిలా వుంటే మరి కొన్ని గంటల్లో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR ఏదైనా ఒక్క అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే మన కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమాల ఫైనల్ లిస్ట్ ని ఆపస్కార్ కమిటీ ప్రకటించనుందట. ఈ నేపథ్యంలో RRR ఫ్యాన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కచ్చితంగా నాటు నాటు సాంగ్ కు కాని, జూ ఎన్టీఆర్ కు కాని, రామ్ చరణ్ కు కాని అవార్డు వస్తుందని ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎప్పుడు 7 గంటలు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.