ట్రిపుల్ ఆర్ సినిమాకు మరో షాక్… ఏపీ హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు

-

‘ట్రిపుల్ ఆర్’ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం. సినిమాను వివాదాలు వెంటాడుతూనే  ఉన్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటే ఏపీ హైకోర్ట్ లో ట్రిపుల్ ఆర్ సినిమాపై పిటీషన్ దాకలైంది. సినిమాలో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించారని మూవీ మేకర్స్ పై ఏపీ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. అల్లూరి యువజన సంఘం జాతీయాధ్యక్షుడు వీరభద్రారావు ఏపీ హైకోర్ట్ ను ఆశ్రయించారు. తెల్లవారితో పోరాడిన అల్లూరిని బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా చూపారని.. అల్లూరి, కోమురంభీం కలిసినట్లు చరిత్రలో లేదని.. అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ షూటింగ్ చేసిన సీన్లన్నింటిని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇది వరకు ఇలాగే అల్లూరి కుటుంబ సభ్యులు కూడా ట్రిపుల్ ఆర్ సినిమాపై తెలంగాణ హైకోర్ట్ లో పిల్ దాఖలు చేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి వివాదాల్లో నలుగుతోంది ట్రిపుల్ ఆర్. గతంలో కూడా ఆదివాసీలు తమ నాయకుడు కొమురంభీం చరిత్రను వక్రీకరిస్తే.. బాగుండదంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

జనవరి7న సినిమా విడుదలవ్వాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండటం, కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో నడుస్తుండటంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని ట్రిపుల్ ఆర్ సినిమాను వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news