ఆర్ ఆర్ ఆర్ పై ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు..!

-

NTR తాజాగా షేర్ చేసిన ఓ సుదీర్ఘ నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తాజా చిత్రం RRR థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి మ్యాజిక్ కు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు.

 

 

 

 

 

అయితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉందని కొంతమంది కామెంట్స్ చేస్తుండగా, ఎన్టీఆర్ కూడా అప్సెట్ అయ్యాడని, అందుకే RRR సక్సెస్ పార్టీకి హాజరు కాలేదని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, చిత్రబృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఎన్టీఆర్ ఓ సుదీర్ఘ నోట్ విడుదల చేశారు. క్షన్ డ్రామా RRRలో భీమ్‌గా నటించిన తారక్ ఆ స్పెషల్ థ్యాంక్స్ నోట్ లో సినిమాని గ్రాండ్ హిట్ చేయడానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రామ్ చరణ్, రాజమౌళి, సహ నటీనటులు, నిర్మాతలు, మిగిలిన టెక్నీషియన్లు, అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు. ఇంకా ఎన్నో మంచి సినిమాలతో అలరిస్తానని తన అభిమానులకు వాగ్దానం చేశారు తారక్. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం పట్ల, అలాగే సినిమాలో తన పాత్ర పట్ల పూర్తి సంతృప్తిగా, సంతోషంగా ఉన్నట్టు తెలిసిపోతోంది. కాగా జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాలో కనిపించనున్నాడు. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కాగా ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ స్పెషల్ నోట్ ఇదే…

Read more RELATED
Recommended to you

Latest news