RRR: ట్రిపుల్ ఆర్ నయా రికార్డ్… తొలిసారిగా ఆఫ్రికా దేశాల్లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాగా గుర్తింపు

-

‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా హిందీ, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈనెల 25న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది ట్రిపుల్ ఆర్. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ యూనిట్ మూవీ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉంది. దుబాయ్ వేదికగా ప్రిరిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా అనేక వాయిదాలు పడ్డ ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ ప్రస్తుతం మరో రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతోంది. నిజానికి తెలుగు సినిమాలు ఆఫ్రికా ఖండంలో రిలీజ్ అవ్వడం చాలా అరుదు నిజానికి లేదనే చెప్పాలి. కేవలం దక్షిణాఫ్రికాలో మాత్రమే తెలుగు ప్రజలు ఉండటంతో అక్కడ మాత్రమే అడపాదడపా తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం మాత్రం ఆఫ్రికా ఖండంలోని 28 దేశాల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది. సౌత్ ఆఫ్రికాతో పాటు తాంజానియా, జాంబియా, కెన్యా, ఉగాండా, జింబాంబ్వే, నమీబియా, ఘనా, నైజీరియా, అంగోలా, సుడాన్, కాంగో లాంటి 28 ఆఫ్రికా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news