ఆర్ ఆర్ ఆర్ : సీత ఫస్ట్ లుక్ వచ్చేసింది !

-

ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లు తెలుగు స్వాతంత్ర సమర యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద అంచనాలను పెంచుతూ రాజమౌళి ఇప్పటికే సీతగా ఆలియా భట్ ప్రీ లుక్ విడుదల చేశారు. తాజాగా సీతగా ఆలియా పూర్తి ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు.

ఈ లుక్‌లో ఆలియా భట్ సాంప్రదాయ బద్ధంగా కూర్చుని కనిపిస్తోంది. ఇక ఈ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.  ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా ప్రస్తుతం గ్రాఫిక్స్‌ పనులు కూడా జరుపుకుంటోంది. ఈ సినిమాను అక్టోబర్‌ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. ఎం ఎం కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news