పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ లకు జన్మించిన మొదటి సంతానం అకీరానందన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే . అకీరానందన్ జన్మించిన తర్వాత రేణు దేశాయ్ , పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న వీరిద్దరూ మళ్లీ ఎప్పుడూ కలవలేదు అని చెప్పాలి. కానీ ఇటీవల తన కొడుకు కోసం మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు ఆనందాన్ని కలుగజేశారు. నిజానికి అకీరానందన్ పియానో ఎలా వాయిస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక తాజాగా ఇతను ఆర్.ఆర్.ఆర్ లో వచ్చిన దోస్తీ పాటను వాయించి అందరికీ ఆశ్చర్యాన్ని కలుగ చేశారు. తాజాగా తన స్కూల్ గ్రాడ్యుయేషన్ డే లో అఖిరా పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఫిదా చేశాడు.తాజాగా అకీరానందన్ తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లస్ టు కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే తన స్కూల్ గ్రాడ్యుయేషన్ డే లో అకీరానందన్ తన టాలెంట్ ను అందరికీ చూపించాడు. ఇక బాక్సింగ్ లో అదరగొట్టే అకీరానందన్ పియానో వాయించడం లో కూడా అంతే దిట్ట. అందుకే అకీరానందన్ పియానో వాయిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని విమర్శకులు సైతం ప్రశంసిస్తూ ఉంటారు. అకీరానందన్ తన స్కూల్ ఫంక్షన్ లో పియానో వాయించి చివరి రోజున తన ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ లో దోస్తీ పాటకు పియానాలో వాయించి అందరికీ వినిపించాడు.అకీరా వాయించిన ఈ పాట దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతుంది.. దటీజ్ పవర్ స్టార్.. పవర్ స్టార్ లాగే మల్టీ టాలెంటెడ్ పవర్ స్టార్ సన్ అంటూ అభిమానులు వీడియో వైరల్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. ఇక అకీరానందన్ గొప్పతనం గురించి కూడా స్కూల్లో చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో 4 ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్ కు ఉచితంగా డొనేట్ చేసి తన మంచి మనసు చాటుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ , మ్యూజిక్ లో ఇలా అన్నింట్లో కూడా గొప్ప ప్రాధాన్యం ఉంది అని తన ఉపాధ్యాయులు అకీరానందన్ గురించి చాలా గొప్పగా చెప్పారు.