‘సలార్’లో ప్రభాస్ మాస్ అవతార్..మరో లుక్ లీక్

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పిక్చర్ ‘సలార్’. ఈ చిత్ర షూటింగ్ ఇటీవల షురూ అయింది. కాగా, ఈ ఫిల్మ్ సెట్స్ నుంచి ప్రభాస్ మరో లుక్ లీక్ అయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సదరు ఫొటోలో ప్రభాస్ బ్లాక్ కలర్ టీ షర్ట్ లో షూటింగ్ స్పాట్ లో డైరెక్షన్ టీమ్ తో డిస్కస్ చేస్తు్న్నట్లు కనబడుతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా, యాక్షన్ సీక్వెన్సెస్ పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణలోని రామగుండంలో ఇప్పటికే ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. కాగా, ఇఫ్పుడు నెక్స్ట్ పార్ట్ షూటింగ్ జరుగుతోంది. బ్యూటిఫుల్ శ్రుతిహాసన్ ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల విడుదలై అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలోనే ‘సలార్’పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news