అన్నదాతలకు శుభవార్త.. రూ.50 వేలు ఇలా పొందొచ్చు..!

అన్నదాతలకు గుడ్ న్యూస్. ఈజీగా లోన్ తీసుకోవచ్చు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇక పూర్తి వివరాలను చూస్తే.. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం ఒక చక్కటి స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. దీనితో మంచిగా లోన్ పొందొచ్చు.

farmers

పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ రిన్ యోజన ఈ స్కీమ్ పేరు. ఈ స్కీమ్ ద్వారా రైతులకి లోన్ వస్తుంది. రూ. 50 వేల వరకు లోన్ ని రైతులు పొందొచ్చు. అది కూడా చాలా ఈజీగానే. ఈ స్కీమ్ ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందిస్తోంది. ఈ డబ్బులు డైరెక్ట్ గా రైతుల బ్యాంక్ ఖాతాలో పడతాయి. బ్యాంక్ స్వయంగా ఈ విషయం చెప్పింది. బ్యాంక్ నుంచి లోన్ రైతులు తీసుకోవచ్చని.

ఆర్ధిక సమస్యలు ఉండవని అంది. కిసాన్ తత్కాల్ లోన్ స్కీమ్ ద్వారా రైతులు గరిష్టంగా రూ.50 వేల వరకు రుణం పొందొచ్చు. పైగా ఎలాంటి సమస్యా ఉండదు. ఏ గ్యారంటీ అవసరం లేదు. అవసరానికి అయినా సరే బ్యాంక్ నుంచి ఈ స్కీమ్ కింద లోన్ ని రైతులు పొందొచ్చు. ఈ స్కీమ్ కింద లోన్ పొందాలంటే వ్యవయసా భూమి కలిగి ఉండాలి రైతులకి.

లేదంటే కౌలుకు చేస్తున్నా కూడా లోన్ ని తీసుకోచ్చు. క్రెడిట్ కార్డు కలిగిన రైతులు కూడా ఈ విధంగా లోన్ తీసుకోచ్చు. కానీ రెండేళ్లుగా బ్యాంక్ రికార్డులు సరిగా ఉండాలి. గరిష్టంగా రూ. 50 వేల వరకు రుణం పొందొచ్చు. దీన్ని ఐదేళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ కి నేరుగా వెళ్లి ఈ లోన్ తీసుకోవచ్చు.