జగన్‌ కీలక నిర్ణయం…ఏపీలో రూ. 268 కోట్లతో 125 అడుగుల‌ అంబేద్కర్‌ విగ్రహం

-

సీఎం జగన్ మోహన్‌ రెడ్డి హామీ ప్రకారం 125 అడుగుల‌ అంబేద్కర్‌ విగ్రహం నెలకొల్పుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఈ విగ్రహం ఏర్పాటు కోసం ఏకంగా 20 ఎకరాల స్థలం కేటాయించామని.. ఈ ప్రాంగణానికి బి.ఆర్.అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పేరు పెడతామని పేర్కొన్నారు. ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు నిర్మాణ బాధ్యతలు ఇచ్చామని… 2023 అంబేద్కర్ జయంతికి ఈ విగ్రహం ప్రారంభించాలని సీఎం చెప్పారని వెల్లడించారు.

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక కమిటీ వేసి ఈ విగ్రహ నిర్మాణం చేయాలని సంకల్పించారని వెల్లడించారు. 20 వేల మీటర్ల ఆడిటోరియం లో 3 వేల మంది ఒకేసారి వినియోగించుకునేలా ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఎక్కడో పొలాల్లో, పుట్టల్లో పెట్టాలనుకున్నాడని.. సీఎం జగన్ అందరికీ అందుబాటులో ఉండేలా అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.విగ్రహానికి రూపురేఖలు ఐఐటీ చెన్నై వారు ఇస్తున్నారని… అంబేద్కర్‌ విగ్రహానికి మొత్తం రూ. 268 కోట్ల నిధుల వ్యయం చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news