బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గుండాయిజం చేస్తున్నాయి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్

-

బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గుండాయిజం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల జీవితాలతో, బీజేపీ పార్టీ పదో తరగతి పిల్లల జీవితాలతో బీజేపీ ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. మెసేజ్ రిసీవ్ చేసుకోవడం నేరం కాదు.. కుట్ర చేయడం నేరమన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భాగం కావడం ఘోరమైన తప్పు.. ఘోరమైన నేరం అందుకే బండి సంజయ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Ex-IPS officer and BSP leader Praveen Kumar slams CM KCR

ఈ రాష్ర్టంలో రాజకీయం చేసే అర్హత బీజేపీ వాళ్లకు లేదన్నారు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను, వారి తల్లి దండ్రులు పేపర్ లీకేజీ వల్ల ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని అందులో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వరంగల్‌లో హిందీ పేపర్ లీక్ కావడం.. ప్రశ్నపత్రాన్ని దాదాపు రెండువందల మందికి షేర్ చేశారని అన్నారు. విచారణలో 120 ఐపీసీ కింద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారని అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రతో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని ఆందోళనకు గురిచేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ ఘటనపై వరంగల్ CP రంగనాథ్‌ను అభినందిస్తున్నాను. ఇందులోనే ఇంత కుట్ర చేస్తే రాబోయే రోజుల్లో మత కలహాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. బండి సంజయ్ ఇప్పుడే కాదు అనేక సందర్భాల్లో కూడా అనేక వాఖ్యలు చేశారని, బండి సంజయ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్పీ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news