ఈట‌ల మార్క్ లేకుండా హుజూరాబాద్‌లో పాల‌న‌.. ఇన్‌చార్జుల‌కే బాధ్య‌త‌లు!

-

ఈట‌ల రాజేంద‌ర్‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన‌ప్ప‌టి నుంచి హుజూరాబాద్‌లో రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే ఈట‌ల కేడ‌ర్‌ను టీఆర్ ఎస్ పార్టీ వైపు తిప్పుకోవ‌డానికి గంగుల క‌మ‌లాక‌ర్ మంత‌నాలు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు ఈట‌ల వెంటే న‌డుస్తామంటూ ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో టీఆర్ ఎస్ అధిష్టానం అల‌ర్ట్ అయింది.

హుజూరాబాద్‌లో ఈట‌ల మార్క్ లేకుండా పాల‌న సాగించాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం హుజూరాబాద్‌, జ‌మ్మికుంట‌, ఇల్లంత‌కుంట‌, క‌మ‌లాపూర్ మండ‌లాల్లో ఏమేం ప‌నులు చేయాలో అక్క‌డి మండ‌ల ఇన్‌చార్జులు తెల‌పాల‌ని గంగుల కోరారు.

వారు పంపిన నివేదిక‌ల‌ను బ‌ట్టి నిధులు మంజూరు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఒక్కో గ్రామానికి రూ.30ల‌క్ష‌లు, మున్సిపాలిటీ అయితే వార్డుకు రూ.30ల‌క్ష‌ల చొప్పున కేటాయించి, కేవ‌లం పార్టీకి పేరు వ‌చ్చేలా చేయాల‌ని చూస్తోంది. ఈ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఈట‌ల కేడ‌ర్‌ను పూర్తిగా దూరంగా ఉంచి, కేవ‌లం టీఆర్ ఎస్ కేడ‌ర్ చేతుల మీదుగా చేయించాల‌ని అధిష్టానం భావిస్తోంది. ఇలా పార్టీకి పేరు తెచ్చుకుంటే రానున్న కాలంలో ఉప ఎన్నిక‌ల్లో గెల‌వొచ్చ‌ని టీఆర్ ఎస్ మాస్ట‌ర్ స్కెచ్ వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version