రేపు భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన.. కుదరనున్న కీలక ఒప్పందాలు

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు భారత్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. చిరకాల మిత్రదేశం రష్యా.. భారత్ ల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడేలా భేటీ జరుగనుంది. ప్రధాని మోదీ – పుతిన్ ల మధ్య సాయంత్రం 5.30 గంటలకు శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పంద జరుగనుంది. తిరిగి రాత్రి 9.30కు పుతిన్ రష్యాకు తిరిగి ప్రయాణం కానున్నారు.

ముఖ్యంగా భారత్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ -400 ను మరింత వేగంగా అనుకున్న సమయంలో అందించాలని భారత్ .. రష్యాను కోరనుంది. దీంతో పాటు రక్షణ రంగంలో పెట్టుబడులు, ఆయుధాల కొనుగోలులో చర్చలు జరిగే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో చిరకాల సంబంధాలు ఉన్నాయి. వీటిని మరింత పెంచుకోనున్నారు. ఇందులో భాగంగానే అమేఠీ సమీపంలోని కోర్వాలో రూ.5 వేల కోట్లతో సంయుక్తంగా నెలకొల్పిన కర్మాగారంలో 5లక్షల ఏకే-230 రైఫిళ్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. సైన్యం కోసం రెండు ఇంజిన్ల 226టీ తేలికపాటి హెలికాప్టర్లను సంయుక్తంగా తయారు చేయాలని కూడా నిర్ణయించనున్నారు. 200 హెలికాప్టర్ల తయారీపై ఒప్పందం కుదిరే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Latest news