సైబీరియా ఎడారిలో రష్యా అణు విన్యాసాలు

-

ఉక్రెయిన్​పై భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా మరో కీలక అడుగు వేసింది. తమ అణుశక్తిని మరింత బలపరుచుకునే పనిలో పడింది. సైబీరియా ఎడారిలో బుధవారం రోజున అణు విన్యాసాలు ప్రారంభించింది. ఈ విన్యాసాల్లో 12 వేల కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే యార్స్‌ ఖండాంతర క్షిపణులూ పాల్గొనడం గమనార్హం. వీటికి వివిధ రకాల అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. మొత్తం మీద 3 వేల మంది సైనిక సిబ్బందితో పాటు 300 వాహనాలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటాయని రష్యా రక్షణశాఖ తెలిపింది. ట్రక్కులపై వెళుతున్న ఖండాంతర క్షిపణుల చిత్రాలను కూడా విడుదల చేసింది.

మొత్తం మూడు ప్రాంతాల్లో యార్స్‌ సంచార వ్యవస్థలు తమ పాటవాన్ని చూపనున్నాయని సమాచారం. ప్రాంతాల పేర్లను మాత్రం మాస్కో వెల్లడించలేదు. క్షిపణి ప్రయోగాలు ఉంటాయా లేదా అన్న విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు. అయితే క్షిపణి పరీక్షలకు సంబంధించి అమెరికాతో ఇక ఎలాంటి సమాచారం పంచుకోబోమని రష్యా ఉప విదేశాంగమంత్రి సెర్గీ రిబకోవ్‌ తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news