రష్యా- ఉక్రెయిన్ మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తత….సరిహద్దుల్లో మోహరించిన రష్యా బలగాలు

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతులు తగ్గలేదు. మరింతగా యుద్ధ వాతారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం రష్యా తమ సైనికులను వెనక్కి పిలిపించినట్లే.. పిలిపించి మళ్లీ మోహరించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా యుద్ధవిన్యాసాలను చేస్తోంది చైనా. ఖండాంతర, క్రూయిజ్ క్షిపణిలతో సైనిక విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాల్లో రష్యాకు చెందిన బ్లాక్ సీ నౌకాదళం పాల్గొంది. ఉక్రెయిన్ సరిహద్దులు, బెలాసర్ దేశానికి లక్షన్నల మంది సైన్యాన్ని రష్యా తరలించింది. ఓవైపు చర్చలకు సిద్ధం అంటూనే.. ఉక్రెయిన్ ను భయపెడుతోంది రష్యా. ఇప్పటికే అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యా మాటలను విశ్వసించడం లేదు. రెండు రోజుల్లో రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. మరోవైపు ఈ రెండు దేశాల మధ్య ఉన్న తూర్పు సరిహద్దుల్లో వేర్పాటువాదులు రష్యాకు మద్దతుగా నిలుస్తున్నారు. నిన్న వేర్పాటువాదులు పలు ప్రాంతాల్లో దాడులు కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news