చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్… రష్యాకు సహాయం చేస్తే తీవ్ర పరిణామాలు

-

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మూడు వారాలుగా కొనసాగుతోంది. కేవలం మూడు నాాలుగు రోజుల్లో ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటీకి అనూహ్యంగా ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్నాయి. నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా… నాటో, అమెరికా, బ్రిటన్ తెరవెనక నుంచి ఉక్రెయిన్ కు సహకరిస్తున్నాయి. అమెరికా భారీగానే ఆయుధాలు, పరికారాల కోసం ఉక్రెయిన్ కు నిధులను అందచేస్తోంది. మరోవైపు చర్చలు జరుగుతున్నా.. రష్యా యుద్ధాన్ని ఆపడం లేదు. మొన్నటి వరకు తూర్పు ప్రాంతాలకే పరిమితం అయిన యుద్ధం ఇప్పుడు పశ్చిమ ప్రాంతాలు, పోలాండ్ దేశానికి సరిహద్దుల్లోని ఎల్వీవ్ నగరాన్ని టార్గెట్ చేసింది రష్యా.. ఈదాడిలో దాదాపు 35 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. 

ఇదిలా ఉంటే రష్యాకు చైనా సహాయాన్ని అడిగిందనే వాదనల మధ్య అమెరికా చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రష్యాకు సహాయం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఉక్రెయిన్ విషయంలో చర్చించేందుకు ఈరోజు అమెరికా, చైానా ఉన్నతాధికారులు రోమ్ లో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తమ సహకారాన్ని కోరలేదని… చైనా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లో తీవ్రంగా ఉన్న సమస్యలు మరింత జఠిలం కాకుండా అడ్డుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అని చైనా స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news