జంగారెడ్డి గూడెం మరణాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… సీఎం జగన్ ఆదేశాలతో తానే స్వయంగా వెళ్లి జంగారెడ్డిగూడెం పరిశీలించాం అని స్పష్టం చేశారు. సహజం మరణాలపై కూడా చంద్రబాబు నాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు మంత్రి ఆళ్ల నాని.
నలుగురు చనిపోతే 18 మంది చనిపోయారని విషప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండటం ఏపీ దురదృష్టమని… ఓ రేంజిలో నిప్పులు చెరిగారు.కాగా.. జంగారెడ్డి గూడెం మరణాలపై ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి… తెలుగుదేశం పార్టీ సభ్యులు, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. జంగారెడ్డిగూడెం మరణాలపై టిడిపి సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. అంతేకాదు స్పీకర్ పై కాగితాలు చింపి వేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్న నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, రామానాయుడు, స్వామిలను సస్పెండ్ చేశారు స్పీకర్.