ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తున్నానని అంటున్న కేఏ పాల్

-

రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రై చేస్తున్నానని అంటున్నారు ఇంటర్నేషనల్ పీస్ మేకర్ కేఏ పాల్. యుద్ధాన్ని ఆపేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్య- ఉక్రెయిన్ నేపథ్యంలో ఆయన కన్నీరు కార్చారు. రష్యా యుద్ధం ప్రారంభించిన రోజును బ్లాక్ డే గా ఆయన అభివర్ణించారు. ఇరాక్, లిబియా, సిరియా, ఆప్ఘనిస్తాన్ యుద్ధాలను నేను వ్యతిరేఖించా అని అన్నారు. వియత్నాం యుద్ధం నుంచి అమెరికా చాలా నేర్చుకుందని ఆయన అన్నారు. యుద్ధాన్ని ఆపలేకపోయిన యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియోగుటెరస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నువ్వేమైనా తాగేసి ఉన్నావా… డ్రగ్స్ వాడుతున్నావా.. బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా అని తిట్టానని కేఏ పాల్ అన్నారు. 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కు కళ్లు నెత్తికెక్కాయని విమర్శించారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ పిచ్చోడు, నియంత, పిచ్చోడంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అయిందని… ఈ యుద్ధం వల్ల 140 కోట్ల భారతీయులపై ప్రభావం పడుతుందని కే.ఏ పాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news