రష్యన్లకు షాక్… పని చేయని యాపిల్ పే, గూగుల్ పే, ఏటీఎంల వద్ద కిలోమీటర్ల మేర క్యూ

-

రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం రష్యా మీద కూడా కనిపిస్తోంది. పలు యూరప్ దేశాలతో పాటు అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా పలు బ్యాంకులపై బ్యాన్ విధించాయి. దీనికి తోడు ఆన్ లైన్ లావాదేవీలకు ఉపయోగించే యాపిల్ పే, గూగుల్ పే పనిచేయడం మానేశాయి. దీంతో పెద్ద ఎత్తున రష్యా ప్రజలు ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. డబ్బును తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. త్వరలో యాపిల్ ఫోన్లలో వీటీబీ బ్యాంక్ యాప్ కూడా పనిచేయదని సమాచారం. ఇదే జరిగితే రష్యాలో యాపిల్ ఫోన్లతో చేసే లావాదేవీలు నిలిచిపోతాయి.

యుద్ధం కారణంగా .. యునైటెడ్ స్టేట్స్ మరియు ఐరోపా దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఆంక్షలను విధించాయి. రష్యా సెంట్రల్ బ్యాంక్, రష్యా నేషనల్ వెల్త్ ఫండ్, రష్యన్ ఆర్థిక మంత్రిత్వ శాఖతో తమ పౌరులు లావాదేవీలు జరపడాన్ని నిషేధించాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసే మెసేజింగ్ నెట్‌వర్క్ అయిన SWIFT నుండి రష్యాను తొలగించడంతో మరింతగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆంక్షల కారణంగా అమెరికన్ డాలర్ తో పోలిస్తే రష్యా రూబెల్ 30 శాతం క్షీణించింది.

Read more RELATED
Recommended to you

Latest news