ఎట్టకేలకు సెట్టైన ఆర్‌ఎక్స్‌100 డైరెక్టర్ సినిమా..!!

-

ఆర్‌ఎక్స్‌100 సినిమా హీరోగా కార్తికేయకు,హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌  డైరెక్టర్‌గా అజయ్‌ భూపతి లకు మంచి పేరు తెచ్చింది. ఈ ఒక్క సినిమా తో హీరో, హీరోయిన్స్ కు చాలా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమా తర్వాత అజయ్‌ భూపతి రెండో సినిమా గా మహాసముద్రం ను తీశాడు.ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్లాప్ అయ్యింది. దీనితో టాలెంటెడ్ డైరెక్టర్ గా వచ్చిన పేరు మొత్తం పోయింది.

దీని నుండి తేరుకున్న అజయ్‌ ప్రస్తుతం ఒక సూపర్  కథతో ఈ సినిమా చేస్తున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడట. ఇది కూడా ఆర్ఎక్స్ 100  సినిమా లాగానే కొత్త జోనర్ లో చేస్తున్న సినిమా అని తెలుస్తోంది. అసలే మహా సముద్రం సినిమా తో ఇద్దరు స్టార్స్ ను పెట్టుకొని తీసిన సినిమా తనని సముద్రం అంత లోతుకు విసిరి వేసింది.

ఇంత టాలెంట్ ఉన్న దర్శకుడు కు మళ్లీ ఇన్నాళ్ల కు సినిమా మొదలు పెడుతున్నాడు అంటూ సమచారం అందుతోంది. తన కెరియర్ లో మూడవ చిత్రం గా వస్తున్న ఈ చిత్రం ను ముద్రా మీడియా వర్క్స్, ఎ క్రియేటివ్ వర్క్స్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 1గా దీనిని నిర్మించనున్నారు. సినిమా టైటిల్ మరియు ఇతర అప్డేట్‌ లు త్వరలో వెల్లడి కానున్నాయి. ఇప్పటి కైనా సినిమా వచ్చిందని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news