తెలంగాణలో రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన పథకం రైతుబంధు..పథకం కింద రైతులకు కొంత నగదు అందుతున్న విషయం తెలిసిందే..ఈ ఏడాది రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది కెసీఆర్ సర్కారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతాంగానికి మంత్రి నిరంజన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రెండో పంట సాగుకు డిసెంబర్ లో రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించారు. రైతుబంధు సాయం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆమోదించిందని చెప్పారు. రైతుబంధు కింద ఏడాదికి రెండుసార్లు రూ. 5వేలు చొప్పున 10 వేలు రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.