రైతు బంధు పంపిణీ.. రేపటి నుంచే మొదలు..

-

వర్షాకాలం వచ్చేసింది. తెలంగాణలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పంటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు నగదు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయిందన్న విమర్శలు వచ్చిన కారణంగా, తాజాగా రైతు బంధు విషయం గురించి కేబినేట్ లో చర్చ జరిగింది. వర్షాకాల పంటల కోసం ఈ నెల 15వ తేదీ నుండి రైతు బంధు నగదు రైతుల ఖాతాల్లోకి జమ కానుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి చేసింది.

15వ తేదీ నుండి 25వ తేదీ వరకు మొత్తం పదిరోజుల్లో అర్హులైన వారందరి ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని తెలిపింది. రైతు బంధు పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య 63.25లక్షల మంది. మొత్తం 7,508కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానుంది. రైతు బంధు ప్రకారం ఎకరానికి 5వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. ఖరీఫ్ తో పాటురబీ కాలాని కీ కూడా ఈ పథకం వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news