ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు.. తీగల వ్యాఖ్యలపై స్పందించిన సబితా !

-

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తీగల కృష్ణారెడ్డిను ఏ విషయంలో మిస్ గైడ్ చేశారో నాకు తెలియదు… అది పెద్ద ఇష్యూ ఏం కాదన్నారు. కబ్జాలు చేస్తే సీఎం చర్యలు తీసుకుంటారని… నేను ఆయనతో కలిసి మాట్లాడుతానన్నారు. కృష్ణన్న ఎందుకు అలా మాట్లాడారరో తెలియదని, ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని చెప్పారు.

తనపై భూకబ్జాలు ఇతర కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వస్తే వాటిపై ముఖ్యమంత్రి విచారించి చర్యలు తీసుకుంటారని, తనపై విచారణ జరుపుకోవచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కబ్జాలు చేసి ఉంటే అలాంటి వాటిని ప్రభుత్వం ఉపేక్షించదని తప్పకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కృష్ణారెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టించారంటూ సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన అలా ఎందుకు తనపై మాట్లాడుతున్నారో తెలియదని, దాని గురించి తెలుసుకుంటానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news