సిద్దు మూసేవాలా హత్య కేసులో సచిన్ బిష్ణోయ్ అరెస్ట్

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్దు మూసేవాల హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయ్ మేనల్లుడు సచిన్ బిష్ణోయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అజార్ బైజాన్ వద్ద పట్టుకున్నట్లు సమాచారం. లారెన్స్ గ్యాంగ్ కు సచిన్ బయట నుంచి సూచనలు ఇచ్చేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఇతను తిలక్ రాజు పేరుతో ఫేక్ పాస్ పోర్టు తీసుకొని పారిపోయినట్లు విదేశాంగ శాఖ గుర్తించి ఎట్టకేలకు అరెస్టు చేసింది.

ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. సచిన్, గోల్డీ బ్రార్, అన్మోల్, లిజిన్ నెహ్రా విదేశాలలో తలదాచుకున్నారు. ఈ కేసులో 34 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఎస్పి గౌరవ్ తోరా తెలిపారు. మే 29న సిద్దు మూసేవాల హత్యకు గురయ్యారు. లారెన్స్ సూచన మేరకు అతని సోదరుడు అన్మోల్, మేనల్లుడు సచిన్ కుట్ర పన్నారని దక్షిణ ఢిల్లీ డిసిపి బినితా మేరీ జాకర్ తెలిపారు. వీరిద్దరూ ముష్కరులను ఏర్పాటు చేసి నకిలీ పాస్పోర్టుల ద్వారా విదేశాలకు పారిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news