దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి గ్లామర్ తోనే కాదు నటనతో కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యంగా స్టార్ హీరోల సరసన నటించే ఈ ముద్దుగుమ్మ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన పాత్ర నచ్చకపోతే నిర్మొహమాటంగా నో చెబుతూ ఉంటుంది. అందుకే ఈమె ఎక్కువగా సెలెక్టివ్ పాత్రలు చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.. ముఖ్యంగా పాత్ర నచ్చకపోతే నిర్మోహమాటంగా నో అని చెప్పే అతి కొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. అంతకుముందు ప్రేమమ్ సినిమాలో మలయాళం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
ఇక ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అంది పుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు సంబంధించి అన్ని విషయాలు తెలుస్తున్నాయి.. కానీ ఆమె ఫ్యామిలీ ఫోటోలు మాత్రం ఎప్పుడు బయటపడలేదు.. ఇక తాజాగా తన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేసుకుంది. సాయి పల్లవి తన తల్లిదండ్రులతోపాటు చెల్లెలు, సోదరుడి తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అచ్చం తల్లిలాగే ఉంది అంటూ ఆమెను తెగ పొగుడుతున్నారు.
ఇకపోతే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడగపెట్టిన ఈమె తెలుగు, తమిళ్, మలయాళం భాషలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరీస్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి, ఆ తర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో జీవించింది. ఎంబిబిఎస్ పూర్తి చేసిన సాయి పల్లవి ఒకవైపు వైద్యవృత్తిని చేపడుతూనే.. మరొకవైపు సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది. ఏది ఏమైనా సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోలు మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి చెప్పవచ్చు.
View this post on Instagram