Sai Pallavi : “గార్గి” గా వస్తున్న సాయిపల్లవి..ఫస్ట్ లుక్ రిలీజ్

-

టాలీవుడ్‌ హీరోయిన్ సాయిపల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపైన సాయి పల్లవి కనబడితే చాలు..ఆనందమే అనేంతలా సినీ అభిమానులపైన ఆమె ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సహజ నటనకు కేరాఫ్ గాఉంటూ తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది సాయిపల్లవి అలియాడ్ లేడీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

‘ఫిదా’ చిత్రంలో జనాన్ని ఫిదా చేసిన ఈ బ్యూటీ..తెలుగు ప్రేక్షకులకు చివరగా నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ పిక్చర్ లో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఇంకా ఏ చిత్రంలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోలేదు. అయితే.. ఇవాళ సాయి పల్లవి బర్త్‌ డే. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా గురించి బిగ్‌ అప్డేట్‌ ఇచ్చింది సాయి పల్లవి. గార్గి అనే సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ సినిమాను గౌతమ్‌ రామచంద్రన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్‌ గా తెరకెక్కుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news