మరోసారి తన సింప్లిసిటీని ప్రదర్శించిన సాయి పల్లవి.!

-

ప్రతి సెలబ్రిటీలు కూడా అభిమానుల నుండి తమను తాము రక్షించుకోవడానికి బౌన్సర్లను నియమించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు లేదా హీరోలు పబ్లిక్ లోకి వచ్చే సమయంలో చుట్టూ ఉండే బౌన్సర్లు చేసే హడావిడి మామూలుగా ఉండదని కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే చాలా విషయాలలో ఇతర హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరించే సాయి పల్లవి తాజాగా ఒక సాధారణ భక్తురాలిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. పుట్టపర్తిలో భక్తులతో కలిసిపోయిన సాయి పల్లవి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నిజానికి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలైన సాయి పల్లవి దేవుని చింతనలో కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకోవడంపై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది సాయి పల్లవి నటించిన సినిమాలకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కినా.. కమర్షియల్ గా ఆ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈమె నటించిన లవ్ స్టోరీ , శ్యామ్ సింగరాయ్ సినిమాలు మినహా పలు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి . అయితే కొంతమంది నిర్మాతలు కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అని కామెంట్లు చేసినా ఆమె మాత్రం ఇలాంటి పాత్రలలో చేయను అని తేల్చి చెప్పేసింది.

అంతేకాదు స్నేహ ,సావిత్రి, సౌందర్య తర్వాత ట్రెడిషనల్ రోల్స్ తో ప్రేక్షకులను మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ల జాబితాలో సాయి పల్లవి కూడా చేరిపోయింది. ఇకపోతే కొత్త సంవత్సరం సందర్భంగా పుట్టపర్తిలో దేవుని కార్యక్రమాలు జరగగా ఆ కార్యక్రమంలో సాయి పల్లవి పాల్గొని చాలా నిరాడంబరంగా కనిపించింది. అంతేకాదు సాయి పల్లవి మాస్కు ధరించడంతో భక్తులు ఆమెను గుర్తుపట్టలేకపోయారు. ఒకవైపు హీరోయిన్ గా మరొకవైపు డాక్టర్గా తన కెరీర్ను కొనసాగిస్తున్న సాయి పల్లవిలో ఇంత టాలెంట్ ఉండి కూడా ఇలా మరొకసారి తన సింప్లిసిటీని చూపించడం తో అభిమానులు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news