SaiPallavi : మరో క్రేజీ ప్రాజెక్టుకు సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్

-

కథానాయికల్లో సాయిపల్లవి రూటే సపరేటు. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ చేయకపోయినా కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. తెరపై ఈ భామ కనిపిస్తే చాలు మనసుకు ఏదో తెలియని హాయి. ఇక సాయిపల్లవి-శేఖర్ కమ్ముల కాంబోకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఫిదా, లవ్‌స్టోరీ సినిమాలు క్రియేట్ చేసిన మ్యాజిక్‌ నుంచి ప్రేక్షకులు ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు.

అయితే ఈ కాంబోకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. కాకపోతే ఈసారి డైరెక్ట్‌గా శేఖర్ కమ్ముల కాదు.. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నాడట. అవునండీ.. శేఖర్ కమ్ముల అసిస్టెంట్ డైరెక్టర్‌తో సాయి పల్లవి ఓ ప్రాజెక్ట్ చేయబోతోందట. అయితే అది సినిమా కాదట. ఓ వెబ్‌సిరీస్‌కు సాయిపల్లవి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందట. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు సాయిపల్లవి శివ కార్తికేయన్‌తో ఓ సినిమాలో.. ధనుష్ 50వ సినిమాలోనూ నటిస్తుందని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news