ఏపీలో వీరికే నామినేటెడ్ పోస్టులు: సజ్జల

-

అమరావతి: ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి ప్రకటించారు. జోడు పదవుల విధానానికి ప్రభుత్వం బ్రేక్ వేసినట్లు తెలిపారు. ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారిత పరంగా సంక్షేమం, అభివృద్ధి పరంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. పదవులన్నీ అలంకార ప్రాయం కాదన్నారు.

లక్షా 30 వేల గ్రామ వాలంటీర్ ఉద్యోగాల్లో సామాజిక న్యాయం పాటించామని పేర్కొన్నారు. 135 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించామని సజ్జల చెప్పారు. 76 పదవులు ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. 59 పోస్టులు ఇతర కులాలకు సంబంధించిన వాళ్లను నియమించామన్నారు. మొత్తం 135 పదవుల్లో 68 పోస్టులను మహిళలకు కేటాయించామని చెప్పారు. గత ముఖ్యమంత్రులెవరూ ఈ విధానంగా భర్తీ చేయలేదని పేర్కొన్నారు.

 

జిల్లాల వారీగా
తూర్పుగోదావరి: 17పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పోస్టులు
పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు
కృష్ణా: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు
గుంటూరు: 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు
నెల్లూరు: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు
చిత్తూరు: 10 పోస్టుల్లోఎస్సీ, ఎప్టీ, బీసీలకు 7 పోస్టులు
కడప: 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు
అనంతరంపురం: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు
కర్నూలు: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు
విశాఖ: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు
శ్రీకాకుళం: 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు
విజయనగరం: 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు
చిత్తూరు: 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7 పోస్టులు

నామినేటెడ్ పోస్టులు.. పేర్ల వారీగా..
టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డికి మరోసారి ఛాన్స్
రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్‌గా సుధాకర్
వీఎమ్ఆర్డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి
ఆర్టీసీ రీజినల్ ఛైర్ పర్సన్‌గా బంగారంమ్మ
మారిటైమ్ బోర్డు ఛైర్మన్‌గా వెంకట్ రెడ్డి
బుడా ఛైర్మన్‌గా ఇంటి స్వాతి
డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడు బాబు
డీసీఎంఎస్ ఛైర్ ఫర్సన్‌గా అవనపు భావన
కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు
టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్న కుమార్

Read more RELATED
Recommended to you

Latest news