స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర – సజ్జల సంచలన వ్యాఖ్యలు

-

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అతిపెద్ద స్కాం అని, ఈ స్కామ్ లో రాజకీయ ప్రమేయం ఉందని పేర్కొన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై మాట్లాడారు సజ్జల.

‘కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో అన్ని అంశాలు బయటకు వస్తాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందొద్దు. సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారు. రాయలసీమకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు. రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు. కోర్టులో కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. పోలవరం జాప్యానికి చంద్రబాబు ఏ కారణం. స్కామ్ లో చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉంది. చంద్రబాబుకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా అని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news