వ్యవస్థలను మేనేజ్ చేయడమే చంద్రబాబు పని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్సార్సీపీ బీసీలకు ఎమ్మెల్సీ పదవులిస్తే.. అది ప్రజలకు తెలియకూడదని గన్నవరంలో గొడవలు సృష్టించారని.. సజ్జల వ్యాఖ్యానించారు. పట్టాభినీ కొట్టారని తప్పుడు వార్తలను చంద్రబాబు, లోకేష్ ట్వీట్ చేశారని చెప్పారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే ఇంప్రేషన్ క్రియేట్ చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం, వికృత ఆలోచనలకు.. మీడియా తోడైందని.. ఇది ఆర్డీఎక్స్ కంటే ప్రమాదకరంగా మారిందని సజ్జల వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల వ్యక్తిత్వాన్ని హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ‘గొడవలు చేయడం, సృష్టించడం అంతా వాళ్లే చేస్తారు.
వీళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయని గమనిస్తే.. టీడీపీ శిక్షణా శిబిరంలో చెంగల్‌రాయుడు మాట్లాడుతూ.. ఎవరినైనా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తే.. జడ్జిల ముందు అబద్ధాలు చెప్పండి అని ట్రైనింగ్ ఇచ్చారు. పోలీసులు కొట్టకపోయినా చెప్పరాని చోట కొట్టారని చెప్పండి అంటూ టీడీపీ నేతలకు శిక్షణ ఇచ్చారు. టీడీపీ అధ్యక్షుడి సమక్షంలో ఆ పార్టీ నేతలకు శిక్షణ ఇస్తున్నారు. వీటిలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను లాగి పదవీచ్యుతుడిని చేశాడు. ఇప్పుడు ఆయన ఫోటోకు దండేసి మా నాయకుడు ఎన్టీఆర్ అంటున్నాడు’ అని సజ్జల ఫైర్ అయ్యారు.