సెలబ్రిటీలన్నాక బ్రాండ్లకు ప్రమోషన్స్ చేయడం సాధారణం. అయితే సెలబ్రిటీలను అభిమానులు ఫాలో అవుతుంటారు. వారేదైనా బ్రాండ్‌కు ప్రచార కర్తగా ఉన్నారంటే ఆ బ్రాండ్‌పై ఆసక్తి చూపిస్తారు. అందుకే సెలబ్రిటీలు వారు ప్రమోట్ చేసే బ్రాండ్లు, ఉత్పత్తులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఎంతో మంది అభిమానులు వాటి వల్ల నష్టపోతుంటారు. గతంలో చాలా మంది సినీ తారలు కొన్ని ఉత్పత్తులకు ప్రచారం చేసి అపకీర్తి మూటగట్టుకున్నారు.
తాజాగా బాలీవుడ్ మెగాస్టార్, అమితాబ్ బచ్చన్ ఆమ్ వే అనే సంస్థకు ప్రచార కర్తగా ఉన్నారు. దీన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తప్పుబట్టారు. గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆమ్వే సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘’గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు’’’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు.
I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023