కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం పెరిగేది అప్పుడే..!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే బహుమతి రాబోతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచేందుకు ప్రభుత్వం త్వరలో ఆమోదం తెలిపేలా కనపడుతోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. బడ్జెట్ 2023 తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతం యొక్క ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లో సవరణ వుండచ్చని తెలుస్తోంది.

ఒకవేళ కనుక ఇది ఆమోదిస్తే ఉద్యోగుల సాలరీ లో పెద్ద పెరుగుదల వుండచ్చట. కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు ఉద్యోగులకి పెరగనుంది. దీనితో నెలకు రూ.8 వేలు, ఏటా రూ.96 వేలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా వుంది.

అంటే 4200 గ్రేడ్ పేలో ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 15,500 అయితే మొత్తం వేతనం 15,500×2.57 అంటే రూ. 39,835 అవుతుంది. ఇది ఇలా ఉంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకి డిమాండ్ చేస్తోంది. కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెరుగుతుంది. అయితే మార్చి 2023లో కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ కూడా పెరుగుతుందట. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ ఏ కాదు. జనవరి 1 నుండి అమలు లోకి వస్తుంది. అదే విధంగా 18 నెలల డీఏ బకాయిలను కూడా ఉద్యోగులకి అందనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news