Chiranjeevi : “గాడ్ ఫాదర్” మూవీలో సల్మాన్ ఖాన్

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చరణ్- నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సత్య దేవు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా నటిస్తున్నట్లు గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి ఆదరణ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ను వదిలింది.

“గాడ్ ఫాదర్” మూవీలో బాలీవుడ్ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ విషయాన్నే స్వయంగా ప్రకటించారు మెగాస్టార్‌ చిరంజీవి. ఈ మేరకు ట్వీట్‌ చేశారు చిరు. భాయ్ కి స్వాగతం పలుకుతూ ప్రత్యేక ట్వీట్ చేసి.. సల్మాన్‌ తో దిగిన ఫోటోను షేర్‌ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news