టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి కనుక ఫిక్స్ అయితే చంద్రబాబే సీఎం అని తేలిపోయింది అని అంటున్నారు వైసీపీ నాయకులు. అంతగా వైసీపీ నాయకులు హడలి పోతున్నారు.జగన్ కు కూడా తనపై తాను ఉంచుకున్న నమ్మకాలు అన్నవి మారుతున్న పరిణామాల రీత్యా గాల్లో తేలిపోతున్నాయి. ఆయన సాధించాల్సిన ఫలితాలు ఏవీ ఇంతవరకూ పొందలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని నిర్ణయానికి వచ్చేసిన జగన్ తనదైన పంథాలో విజయావకాశాలు వెతుక్కుంటున్నారు.ఈ దశలో మళ్లీ జగన్ సీఎం అవుతారా అన్నదే ఇవాళ్టి మనలోకం సైట్ నిర్వహిస్తోన్న ట్విటర్ పోల్ …
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్య మార్పులు మరియు పరిణామ సంబంధ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మరో రెండు నెలల్లో జగన్ పాలనకు మూడేళ్లు నిండిపోనుండడంతో ఆయన మరోదిశగా అడుగులు వేస్తున్నారు. మంత్రులు,ఎమ్మెల్యేలు అంతా కలిసి సమష్టిగా పనిచేయాలని ఇప్పటికే వార్నింగ్ లు కూడా ఇచ్చారు.తన వద్ద పనిచేయకుండా కాలం గడిపే వాళ్లు, డబ్బా మాటలు చెప్పే వాళ్లు ఉండ కూడదని కూడా చెప్పకనే చెప్పేశారు. పథకాల అమలు వాటి తీరుతెన్నులపై క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునే తీరాలని కూడా అన్నారు. డోర్ టు డోర్ సర్వే చేయాలని కూడా చెప్పారు.ఇవన్నీబాగానే ఉన్నాఆయన తరఫున చేయాల్సినవి చాలానే ఉన్నాయి.
దాదాపు మూడేళ్ల కాలంలో కరోనా కారణంగా కొంత కాలం తరువాత వేర్వేరు కారణాలతో కొంత కాలం అస్సలు జనం మధ్యకే రాలేదు.జిల్లాల పర్యటనలు చేపట్టలేదు. మంత్రులు కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. వాళ్లు కూడా ఆకస్మిక తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. దీంతో పాలన ఇవాళ అస్తవ్యస్తంగా ఉంది.ప్రాజెక్టుల నిర్వహణకు జగన్ తరఫున తీసుకున్న చర్యలేవీ లేవు. ఇవే కాదు వీటితో పాటు చాలానే ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు వచ్చిన ప్రతిసారీ కూడా పథకాలకే మళ్లిస్తున్నారు తప్ప సంక్షేమ జపమే చేస్తున్నారు తప్ప అభివృద్ధి ఊసే లేదు.ఈ తరుణంలో ఆయన కొత్తగా కొన్ని నిర్ణయాలు వెలువరించినా కూడా అవన్నీ ఆశించిన రీతిలో సత్ఫలితాలు ఇవ్వవు.
మళ్లీ ఏపీ సీఎం జగన్ ..?@YSRCParty #YSRCP #YsJaganMohanReddy
— Manalokam (@manalokamsocial) March 16, 2022