నిలకడగా సల్మాన్ రష్దీ ఆరోగ్యం.. వైద్యులు ఏమన్నారంటే?

-

సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఇటీవల న్యూయార్క్ సమావేశంలో ప్రసంగిస్తుండగా ఓ యువకుడు స్టేజీపైకి వచ్చి సల్మాన్ రష్దీని అతి దారుణంగా కొత్తి పొడిచిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన రష్దీని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చేతి నరాలు తెగిపోవడం, కన్ను కోల్పోవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో వైద్యులు వెంటీలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

సల్మాన్ రష్దీ
సల్మాన్ రష్దీ

అయితే ప్రస్తుతం రష్దీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అందుకే రష్దీని వెంటిలేటర్ పైనుంచి తొలగించి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారని రష్దీ ఏజెంట్ ఆండ్ర్యూ వైలీ తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితిపై మరిన్నీ వివరాలు తెలియజేయలేదు. అయితే మెడపై, భుజం, కాలేయ భాగాల్లో కత్తిపోట్లు ఉన్నాయని, కోలుకోవడానికి కొంచెం సమయం పట్టేలా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news