హీరో కార్తీతో సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత దూకుడు పెంచేసింది. వ‌ర‌స‌గా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ చెబుతూ బిజీ బిజిగా ఉంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా సినిమా య‌శోద‌తో పాటు ఒక ఇంట‌ర్నేషన‌ల్ సినిమాను స‌మంత లైన్ లో పెట్టింది. అలాగే వెబ్ సిరీస్ ల‌లో న‌టించ‌డానికి కూడా అంగీక‌రించింది. తాజా గా మ‌రో సినిమాకు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు స‌మాచారం. త‌మిళ స్టార్ హీరో కార్తీ తో న‌టించ‌డానికి స‌మంత అంగీక‌రించిన‌ట్టు తెలుస్తుంది.

కాగ ఇటీవ‌ల త‌మిళలో విడుద‌ల బ్యాచిలర్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యాచిల‌ర్ సినిమా ద‌ర్శ‌కుడు స‌తీష్ సెల్వ‌కుమార్ తో హీరో కార్తీ సినిమా చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన స్క్రీప్ట్ ను కూడా రెడీ అయింద‌ని తెలుస్తుంది. ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే చేయ‌నున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా స‌మంత ను చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా అధికారిక ప్ర‌క‌ట‌న‌ను త్వ‌ర‌లోనే చిత్ర బృందం ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news