సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గత ఏడాది మయోసైటిస్ కారణంగా నెలల తరబడి హాస్పిటల్ కి పరిమితమైన విషయం తెలిసిందే. కనీసం కదలలేని పరిస్థితిలో ఉన్న ఈమె ట్రీట్మెంట్ తీసుకుంటూ రికవరీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఇంట్లోనే ఉంటూనే రోజుకు నాలుగు గంటల పాటు మయోసైటీస్ కి ప్రత్యేక చికిత్స తీసుకుంటుంది సమంత. ఇకపోతే తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా పంచుకొని కన్నీళ్లు పెట్టుకున్న ఈమె.. తనకు తాను ధైర్యం చెప్పుకొని సినిమాలు చేయడానికి మళ్లీ తన మేకోవర్ ను మార్చుకుంటుంది.
సాధారణంగా వైద్యులు కూడా మయోసైటిస్ బారిన పడినవారు ట్రీట్మెంట్ తర్వాత రెగ్యులర్ లైఫ్ ను లీడ్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతుందని చెప్పుకొచ్చారు. అయితే సమంత మాత్రం ఫైటర్ అని చెప్పాలి.. అసలు తాను ఎందుకు ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయింది అనేది ఆమె డెడికేషన్ చూస్తుంటే అర్థమవుతుంది.. మయోసైటీస్ నుంచి ఆమె రికవరీ అయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా రెగ్యులర్గా వర్క్ ఔట్స్, యోగా, ఫిట్నెస్ యాక్టివిటీస్ అంటూ తనను తాను మరింతగా మార్చుకుంటుంది.
మరొకవైపు తన శరీర ఆకృతిని మళ్లీ తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడంతోపాటు సినిమా కోసం బాక్సింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తోంది. ఫుల్ ఫిట్నెస్ ఫ్రీక్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో యాక్టివ్గా, రెగ్యులర్గా తన ఫిట్నెస్ వర్కౌట్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉండగా.. ఇప్పుడు అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూస్తున్నవారు సమంత మంచి ఫైర్ మీద ఉంది.. తీవ్రమైన వ్యాధి బారిన పడినా కూడా ఆమెలో సంకల్పం తగ్గలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ పెద్దగా కష్టపడుతుంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram