విడాకుల తర్వాత.. సమంత కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ !

-

అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల ఎపిసోడ్ అనంతరం.. సమంత ఏం చేసినా వైరల్ గా మారుతుంది. అంతేకాదు వీళ్ళిద్దరి ఎపిసోడు.. మీడియాను ఫుల్ బిజీ చేసేస్తుంది. అయితే విడాకుల అనంతరం హీరోయిన్ సమంత నటించిన… ఓ కొత్త సినిమా నుంచి పోస్టర్ విడుదల అయింది. ఈ సినిమాలో ఖతిజగా సమంత అందరినీ అలరించనుంది.

విజయ్ సేతుపతి, నయనతారతో కలిసి సమంత నటించిన కోలీవుడ్ మల్టీస్టారర్ మూవీ “కాతువాకుల రెండు కాదల్”. ఈ సినిమా నుంచి తాజాగా సమంత ఫస్ట్ లుక్ విడుదల అయింది. చిత్ర నిర్మాతలు ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ఇందులో విజయ్ రాంబో గా కనిపించగా హీరోయిన్ సమంత మాత్రం ఖతియా గా కనిపించింది. ఇక తాజాగా విడుదలైన పోస్టర్ లో సమంత చాలా అందంగా కనిపించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్ తో కలిసి 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news