సల్మాన్ తో సమంత కొత్త సినిమా ?

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

అయితే సమంత తన తర్వాతి మూవీలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులకు ముందు విజయ్‌ దళపతి సినిమాలో సమంత విలన్‌ గా కనిపిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. సమంతకు మరో ఆఫర్‌ వచ్చిందట. దుల్కర్‌ సల్మాన్‌ తర్వాత నటించే కొత్త సినిమా కింగ్‌ ఆఫ్‌ కొత. ఈ సినిమాను అభిలాష్‌ జోషి అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. అయితే..ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ కు జోడీగా సమంతను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. దీనికి సమంత కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

 

Read more RELATED
Recommended to you

Latest news