Samantha: విడాకుల తర్వాత.. విచారంలో స‌మంత.. ఫస్ట్ మూవీ అనౌన్స్ ఇదే!

-

Samantha: గ‌త కొన్ని రోజులుగా సమంత-నాగ చైత‌న్య‌ల విడాకుల వార్త ట్రేడింగ్ లో ఉంది. ప‌లురకాల వార్తలు సోషల్‌ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వారిద్ద‌రూ తీసుకునే ఏ నిర్ణ‌యమైన వార్తల్లో నిలుస్తోంది. విడాకుల అనంత‌రం.. సమంత ఏం చేయనుంది, ఆ తర్వాత తన నిర్ణయమేంట‌ని ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో స‌మంత బాలీవుడ్ లోకి ఏంట్రీ ఇస్తున్న‌ద‌నీ, హిందీ చిత్రాల్లో న‌టించ‌బోతుంద‌ని, ఇక‌ అక్కడే త‌న ప్రాజెక్ట్స్‌కు సంతకం చేయబోతుందంటూ ప్ర‌చారం జోరుగా సాగింది.

ఇదిలా ఉంటే.. చైతు.. థాంక్యూ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మ‌రి స‌మంత నుంచి ఎలాంటి అప్డేట్స్ వ‌స్తాయని చాలా ఆస‌క్తిగా చూస్తున్నారు త‌న అభిమానులు. ఈ త‌రుణంలో తాజాగా సమంత దసరా కానుకగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. నెక్ట్‌ మూవీ అప్‌డేట్‌ బయట పెట్టింది. ఇప్ప‌టికే శాకుంతం మూవీ డబ్బింగ్ లో బిజీ బిజీగా ఉన్నా సామ్‌ తన తదుపరి చిత్రం డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయ‌బోతున్నార‌ట‌. ఇందుకు సంబంధించిన ఆఫిసియ‌ల్ అనౌన్స్ మెంట్ వెలువ‌డింది.

ఎస్ఆర్ ప్ర‌భు డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ కోసం స‌మంత ప‌ని చేయ‌నుండ‌గా, ఇంకా పేరు పెట్టని బైలింగ్యువ‌ల్ మూవీకి శాంతరూబన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వం వహించ‌నున్నారు. ఈ చిత్రం డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీగా ఉంటుంద‌ని, ఈ చిత్రాన్ని ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఇందులో సమంత విచారంగా కనిపిస్తుండగా, ఓ విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని తెలుస్తోంది. సామ్ ఇప్పుడు ల‌వ్ స్టోరీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలను మ‌రి కొద్ది రోజుల‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news