Samantha : ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సమంత.. ఫోటోలు వైరల్

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది.


మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే సమంత తన తర్వాతి మూవీలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులకు ముందు విజయ్‌ దళపతి సినిమాలో సమంత విలన్‌ గా కనిపిస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మధ్య ఈ సినిమా నుంచి మరో వార్త వైరల్‌ గా మారింది. యాక్షన్ డ్రామాగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో సమంత పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించననుందట. అది కూడా నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపించనున్నట్లు టాక్‌. ఇది ఇలా ఉండగా తాజాగా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళింది సమంత. బ్రౌన్ కలర్ షర్ట్, వైట్ కలర్ పాయింట్ వేసుకొని ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news