సన్యాసిలా మారిన సమంత..ఫోటోలు వైరల్ !

-

విడాకులు తీసుకున్న అనంతరం.. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుతోంది సమంత. ఇటు వరుసగా సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూనే… తన స్నేహితులతో… విహార యాత్రలకు వెళుతోంది. అటు తన విడాకులపై నెటిజన్లు కామెంట్లు చేసే అంశంపై కూడా సమంత చాలా స్ట్రాంగ్‌ గా కౌంటర్‌ ఇస్తూనే ఉంది. ముఖ్యంగా సమంత గ్లామర్ డోసు పెంచుతోంది.

స్కీన్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు తన అందాలతో ట్రీట్ ఇస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన హాట్ ఫోటోలను పెడుతూ… తెగ హంగామా చేస్తోంది ఈ చెన్నై చిన్నది. ఇటీవల గ్రీన్ డ్రెస్ లో తన అందాలతో కుర్రకారును కట్టిపడేసింది.

ఓ రేంజ్ లో స్కీన్ షో చేసింది. ఇది ఇలా ఉండగా..నిన్న సమంత ఓ ఫోటో షేర్‌ చేసి.. అందరినీ షాక్‌ కు గురి చేసింది. వైట్‌ డ్రెస్‌, మెడలో దండ వేసుకుని.. అచ్చం సన్యాసిలా కనిపించింది. దీంతో అందరూ సమంత సన్యాసం తీసుకుంటుందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news