సోషల్ మీడియాకి దూరంగా ఉన్న సమంత.. అందుకేనా..?

-

సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది. ఇకపోతే తాను ప్రేమించిన నాగచైతన్యను వివాహం చేసుకొని ఆ తరువాత విడాకులు తీసుకుంది. ఇక విడాకుల తర్వాత కూడా ఏమాత్రం తగ్గకుండా పడి లేచిన కెరటంలా వరుస అవకాశాలు అందుకుంటూ తన సినీ కెరియర్లో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా సమంత వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో జోరు కొనసాగించిందో విడాకుల తర్వాత రెట్టించిన వేగంతో సినిమాలలో దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూనే బోల్డ్ పాత్రలలో కూడా నటించడానికి వెనుకాడడం లేదు ఈ ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా విడాకుల తర్వాత మొన్నటి వరకు ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను ఎన్నో షేర్ చేస్తూనే.. తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ఎన్నో ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. అయితే ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉందని వార్త వైరల్ అవుతుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉండే ఈ ముద్దుగుమ్మ ఇలా ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.Samantha drops Akkineni from Twitter and Insta handles, changes name to S. What's brewing? - Movies Newsఇకపోతే సమంత ఉన్నట్టుండి ఇలా సోషల్ మీడియాకు దూరం కావడానికి కారణం కూడా లేకపోలేదు. సమంత ప్రస్తుతం తన సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటుంది. రస్సో బ్రదర్స్ సిటాడెల్ లో తన పాత్ర కోసం చాలా కష్టపడుతున్నట్లు సమాచారం. ఇక ఇలా కెరియర్ కోసం కష్టపడుతున్న నేపథ్యంలో సమంత సోషల్ మీడియాను దూరం పెట్టిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే సమంత ఇలా సోషల్ మీడియాను దూరం పెట్టడంతో ఫాన్స్ అంతా సమంత సోషల్ మీడియాను డీటాక్స్ అని పిలుస్తున్నారు. ఇదే కాదు సమంత నటిస్తున్న చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించే వరకు సోషల్ మీడియాను ముట్టుకోదు అంటూ ఆమె అభిమానులు వెల్లడిస్తున్నారు. మరి సమంత ఎన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందో తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news