బాలీవుడ్ ప్రియాంక చోప్రా పై సమంత సంచలన పోస్టు !

టాలీవుడ్ హీరోయిన్ సమంత కు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో సమంత దూసుకుపోతుంది. అయితే నాగచైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంతపై విమర్శలు భారీగా పెరిగాయి. అయితే వాటికి తగిన విధంగానే సమంత సమాధానం చెబుతూనే వస్తుంది. అయితే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పై ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రియాంక చోప్రా షేర్ చేసిన వీడియో పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సమంత.

ప్రియాంక చేసిన ఆ వీడియో చాలా అద్భుతంగా ఉందని తో హార్ట్ సింబల్ తో షేర్ చేసింది సమంత. ఇంతకీ ప్రియాంక ఏం చెప్పారంటే..” నా చిన్నప్పటి నుంచి మా నాన్న, నాకు తొమ్మిదేళ్ళ వయసు నుంచి అనేక విషయాలు నేర్పేవారు. ఏదైనా చేయాలనుకుంటే అంతకన్నా ఏ ముందు నువ్వు ఆర్థిక స్వతంత్రాన్ని సాధించాలి. నువ్వు ఎవరి కూతురు వి ఎవరిని పెళ్లి చేసుకున్నావు అన్నది ముఖ్యం కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. “అంటూ చెప్పేవారు. వారి విషయాలను ఇప్పటికీ గుర్తుంచుకుని… నా లక్ష్యాలను చేరుకుంటున్నాను అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. అయితే ప్రియాంక చోప్రా వ్యాఖ్యలకు సమంత ఫిదా అయిపోయింది. ఓ హార్ట్ సింబల్ వేస్తూ .. ప్రియాంక చోప్రా వీడియోను షేర్ చేసింది సమంత. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది.