Samantha : సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. ఇదే సాక్ష్యం ?

-

హీరోయిన్ సమంత… గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, అందరికీ టచ్ లో ఉండేది. అయితే నాగచైతన్య తో విడాకులు తీసుకున్న అనంతరం హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో బాగానే ఆక్టివ్ గా ఉండేది. ఏమైందో కానీ గత రెండు నెలల నుంచి సమంత సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనడం లేదు.


ఇలాంటి తరుణంలోనే తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరో కొత్త… ఆలోచనకు తెర లేపింది. సమంత మరోసారి ప్రేమలో పడిందా అనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యేలా ఆమె ట్వీట్ చేసింది. దానికి కారణం ఆమె ధరించిన టీ షర్ట్.

సమంత తన టీ షర్ట్‌ పై ఉన్న కోట్‌ కనిపించేలా ఓ పిక్‌ ను షేర్‌ చేసింది. YOU’LL NEVER WALK ALONE అంటూ ఆ టీ షర్ట్‌ పై రాసి ఉంది. ఆ కోట్‌ నే పోస్ట్‌ చేసింది సమంత. అంటే..నువ్వు ఎప్పుడూ ఒంటరిగా గడువు అని ఆ టీషర్ట్ పై రాసి ఉందన్నమాట. అయితే గతంలో ఓసారి సమంత లవ్ గురించి మాట్లాడుతూ మరోసారి ప్రేమలో పడేంత ఆసక్తి లేదని స్పష్టం చేసిన క్రమంలో ఇప్పుడు ఇలా టీ షర్టు ఫోటోలు పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news